ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గర ఎంతో మంది పనిచేస్తూంటారు. ముఖ్యంగా రైటింగ్ డిపార్టమెంట్, డైరక్షన్ డిపార్టమెంట్ వింగ్ లలో ఎక్కువ మంది ఉంటారు. కొత్త స్క్రిప్టులు డవలప్ చేయటం, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ దిల్ రాజుకు ఇవ్వటం, ఆయన ఓకే అనకుంటే హీరోలకు నేరేషన్ ఇవ్వటం. ..పట్టాలు ఎక్కించటం ఇవన్నీ ఓ పద్దతి ప్రకారం జరిగిపోతూంటాయి. దిల్ రాజు క్యాంప్ నుంచి సుకుమార్, వంశీ పైడిపల్లి,బొమ్మరిల్లు భాస్కర్ వంటి అనేక మంది స్టార్ డైరక్టర్స్ బయిటకు వచ్చారు. దాంతో ఎప్పుడూ ఆయన క్యాంప్ లో చేరటానికి కుర్రాళ్లు తెగ తిరుగుతూంటారు. వీళ్లందరికీ దిల్ రాజు బ్రేక్ ఇవ్వనున్నారు. అలాగే షూటింగ్ లు, స్క్రిప్టుల విషయమై తన స్టాప్ కు క్లియర్ గా ఇనస్ట్రక్షన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఓ నాలుగు రోజుల క్రితం తన స్టాఫ్ లో కీ టీమ్ తో మీటింగ్ పెట్టిన దిల్ రాజు...వకీల్ సాబ్ తప్పించి ఈ సంవత్సరం ఏ కొత్త సినిమా షూటింగ్ పెట్టకోమని చెప్పారట. అలాగే స్క్రిప్టుల డిస్కషన్స్ కొంతకాలం ఆపమని చెప్పారట. కొత్త కథలు వినమని చెప్పేసారట. ఇక అసెస్టెంట్స్ గా ఎవరినీ తీసుకోవద్దని, అన్నీ వచ్చే సంవత్సరం చూసుకుందామని చెప్పారట.  అలాగే అదే సమయంలో రిలీజ్ డేట్ తెలియకుండా షూటింగ్ చేసి పెట్టుకోవటం అంటే డబ్బుని బ్లాక్ చేయటమే అని,..... కాబట్టి థియోటర్స్ వదిలాక, జనాలు వెళ్తున్నారు అనుకున్నాక..మిగిలిన ఆ కాస్త షూటింగ్ ఫినిష్ చేసి జనాలు మళ్లీ థియోటర్స్ అలవాటు పడ్డాక రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట.  
 
ఇక వకీల్ సాబ్ సినిమాకు ఇంకా 35 వర్కింగ్ డేస్ పెండింగ్ ఉందిట. అలాగే మినిమం రెండు నుంచి మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పడుతుంది.  ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట.  అలాగే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కి అండ్ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోని కపూర్ సమర్పిస్తున్నారు.