సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్‌లు, సినిమాలు లేక కుదేళవుతున్న ఇండస్ట్రీని వరుసగా మరణ వార్తలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించి మరో వ్యక్తి మరణించటంతో బాలీవుడ్ లో విషాద వాతావరణం నెలకొంది. బాలీవుడ్ లెజెండ్‌ దిలీప్‌ కుమార్ సోదరుడు, ఆయన సినిమాలకు తెర వెనుక కీలక పాత్ర పోషించిన అస్లాం ఖాన్‌ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

ఇటీవల దిలీప్‌ కుమార్ సోదరుడు అస్లాం ఖాన్‌, ఇషాన్‌ ఖాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వారు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారి వయసు ఎక్కువ కావటంతో పాటు బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు కూడా ఉండటంతో ఆయన మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారు. అస్లాం పెద్ద వయసు వ్యక్తి కావటం వల్లే చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన సోదరుడు ఇషాన్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అస్లాం కన్నా ఇషాన్‌ పెద్దవాడు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆక్సిజన్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయని వెల్లడించాయి ఆసుపత్రి వర్గాలు.