సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ని ముంబై లీలావతి హాస్పిటల్ లో చేర్పించారు. అయన అఫీషియల్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ తో ఈ విషయం బయటకి వచ్చింది.
సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ని ముంబై లీలావతి హాస్పిటల్ లో చేర్పించారు. అయన అఫీషియల్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ తో ఈ విషయం బయటకి వచ్చింది. ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన ఆయన 1998లో సినిమాలకు దూరమయ్యారు. ఆయన నటించిన ఆఖరి సినిమా 'కిలా'. బాలీవుడ్ లో 'ట్రాజెడీ కింగ్'గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇండియా సినిమాలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు.
నయా దౌర్, ముఘల్ ఈ అజాం, దేవదాస్, అందాజ్, విధాత, శక్తి, కర్మ వంటి సినిమాలో ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గవి. 2015 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో అతడిని సత్కరించింది.
Scroll to load tweet…
