‘రిపబ్లిక్‌’రిలీజ్ డేట్ పై డిస్కషన్,ఏం చేద్దాం?

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.  

Dilemma situation for Republic release plan?

సాయితేజ్‌ హీరోగా ‘రిపబ్లిక్‌’తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రస్థానం’ఫేమ్‌ దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.  సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అక్టోబర్ 1 రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడు అదే డేట్ కు ముందుకు వెళ్దామా వద్దా అనే డైలమో సిట్యువేషన్ లో నిర్మాతలు పడినట్లు సమాచారం. ప్రస్తుతం సాయి తేజ్ ..యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రిలీజ్ వాయిదా వేయటమే బెస్ట్ అని భావిస్తున్నారట. అయితే ఇంకా ఫైనల్ గా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది.

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కండీషన్ లో సాయి తేజ్ కొద్ది కాలం వరకూ ప్రమోషన్స్ కు  రాలేరు. ఇంటర్వూలు ఇవ్వలేరు. అలాగే ఆ సక్సెస్ ని ఆయన ఎంజాయ్ చేసే మూడ్ లోనూ లేరు. కొంతకాలం ఆగితే అన్ని సెట్ అవుతాయి.  సాయితేజ్‌ ‘అభి’గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. పెన్సిల్‌ స్కెచ్‌ వంటి చిత్రంతో ఉన్న పోస్టర్‌పై ‘డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు!’ అంటూ రాసుకొచ్చారు. 

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. 

ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేస్తున్నారు. ‘‘సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం’’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు  చెప్తున్నాయి.

 శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios