పవన్ కళ్యాణ్ కు దిల్ రాజు స్పెషల్ రిక్వెస్ట్
దిల్ రాజు నిర్మాతగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. 2018 తర్వాత పవన్ సినిమా మళ్లీ ఇదే రిలీజ్ అవటం. అలాగే కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న అతి పెద్ద సినిమా కూడా ఇదే. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ డిస్కస్ చేయటానికి దిల్ రాజు...పవన్ ని కలిసారని సమాచారం. ఆ నేపధ్యంలో ఆయన చిన్న రిక్వెస్ట్ చేసారట.

సాధారణంగా పవన్ కళ్యాణ్...ప్రమోషన్స్ దూరంగా ఉంటారు. కానీ దిల్ రాజు ఈ సారి పవన్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసారట. ప్రమోషన్స్ కు కొంత టైమ్ కేటాయించమని కోరారట. ఓకే అని చెప్పటంతో అందుకు తగ్గ ప్లాన్ ని దిల్ రాజు అందచేస్తామని చెప్పారట. అయితే ప్రమోషన్స్ లో భాగంగా వీడియో ఇంటర్వూ ఇద్దామని ప్లాన్ చేసారట. మీడియాతో పవన్ మాట్లాడటం కన్నా..గతంలో మాదిరిగానే పవన్ తో ఓ యాంకర్ మాట్లాడిన ఇంటర్వూని ఛానెల్స్ కు విడుదల చేద్దామని అనుకుంటన్నారట. అయితే ఈ విషయమై ఇంకా కన్ఫర్మేషన్ లేదు.
ఈ చిత్రం ట్రైలర్ మార్చి 29న విడుదల చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏప్రియల్ 3న యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసారు. రాజకీయాల కారణంగా చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవర్‌స్టార్. ‘వకీల్‌సాబ్’తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది రుచి చూపించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. తమన్ సంగీతం అందించారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.