Asianet News TeluguAsianet News Telugu

#Anilravipudi:అనీల్ రావిపూడి నెక్ట్స్ సెట్టైంది, హీరో, నిర్మాత డిటేల్స్

మెగాస్టార్ తో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో బిజీ అయ్యారు. 

Dil Raju, Venkatesh, Anil Ravipudi combination again jsp
Author
First Published Feb 2, 2024, 9:32 AM IST | Last Updated Feb 2, 2024, 9:32 AM IST


అనిల్ రావిపూడి కెరీర్ ప్రారంభం నుంచీ  తెలుగులో వరుస హిట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరం దర్శకులైన జంధ్యాల, రేలంగి నరసింహా రావు. ఈవివి, ఎస్వీ కృష్ణారెడ్డి తర్వాత కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. యాక్షన్ మిళితమైన కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దాంతో నెక్ట్స్ ఏ హీరో తో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అంతటా మొదలైంది. రవితేజతో ప్రాజెక్టు ఉంటుందనుకున్నారు. కానీ  ఆ హీరోతో కాదని వేరే హీరోతో సినిమా సెట్టైందని సమాచారం. ఇంతకీ ఎవరా హీరో, నిర్మాత,జానర్ అంటే...

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... వెంకటేష్ తో అనీల్ రావిపూడి మరో సినిమా చేయబోతున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3 తరువాత వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజ్ వస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టుని స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నిర్మించనున్నారు. అనీల్ రావిపూడితో దిల్ రాజు వరసపెట్టి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3.... సినిమాలు చేసారు. ఈ క్రమంలో  ఓ డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు శ్రీకారం అవుతుంది. ఈ చిత్రం సైతం  హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు. ప్రస్తుతం అయితే అనీల్ రావిపూడి సైలెంట్ గా నెక్స్ట్ సినిమా కి కథని సిద్ధం చేసుకుంటున్నారు.
 
సైంధవ్ తో డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన వెంకటేష్ కు ఈ సినిమా బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే వెంకీ మామకు అనిల్ రావిపూడి ఒక స్క్రిప్ట్ నెరేట్ చేశారట. స్టోరీ లైన్ నచ్చడంతో వెంకటేష్ పచ్చజెండా కూడా ఊపేశారని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ మీద ఇప్పుడు అనిల్ రావిపూడి వర్క్ చేయనున్నారట. త్వరలో పూర్తి స్క్రిప్ట్ వెంకటేష్ కు అనిల్ వివరించనున్నారట. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందట. ఈ సినిమా కోసం వెంకటేష్, అనిల్ రావిపూడి ఇద్దరూ భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఆయన వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో బిజీ అయ్యారు. ఈ  ఏడాది మధ్య వరకు ఆయన ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమవుతారు. కాబట్టి, ఈ లోపల వెంకీ తో సినిమా పూర్తిచేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios