నితిన్ కు ఈ మధ్య కాలంలో రెండు ఫ్లాప్ సినిమాలు పడడంతో తను నటిస్తోన్న 'శ్రీనివాస కళ్యాణం'పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ అందుకోవడం నితిన్ కెరీర్ కు చాలా ముఖ్యం. సతీష్ వేగ్నేస డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. సాధారణంగా తన సినిమాల విషయంలో దిల్ రాజు చాలా ప్లాన్డ్ గా ఉంటాడు. 

స్క్రిప్ట్ విషయంలో ఆయన జడ్జిమెంట్ ను దర్శకులు కూడా గౌరవిస్తారు. సినిమా మొదలు పెట్టడానికి ముందు స్క్రిప్ట్ వర్క్ మీద చాలా సమయం తీసుకుంటారు. స్క్రిప్ట్ మొత్తం సంతృప్తిగా అనిపించిన తరువాతే సెట్స్ పైకి వెళ్తారు. ఇక షూటింగ్ సమయంలో ఏదైనా సన్నివేశం తనకు నచ్చకపోతే మళ్లీ రీషూట్స్ చేస్తాడే కానీ అస్సలు రాజీ పడరు. అయితే 'శ్రీనివాస కళ్యాణం' సినిమా దిల్ రాజు ఆశించినట్లుగా రాలేదని సమాచారం.

ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలు ఆయనకు సంతృప్తికరంగా అనిపించలేదని అంటున్నారు. స్క్రిప్ట్ మొత్తం పక్కగా ఉన్నా.. మేకింగ్ విషయంలో తేడా ఉందని ఇప్పుడు వాటిని సరిచేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా కనిపించనుంది.