పెద్ద సినిమాలు రిలీజ్ దిల్ రాజు హ్యాండ్ లేనిదే జరగదు. ఎందుకంటే నైజాంలో మంచి థియోటర్స్ అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే దిల్ రాజు చేతిలో సినిమా ఉందంటే దాన్ని ప్రోపర్ ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్తాడు. అలాగే ఇప్పుడు దిల్ రాజు మార్కెట్లో హాట్ కేకు లా ఉన్న 'సాహో' నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ భారీ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం. 

ఈ రెండు ఏరియాలకీ రెండు ఒకటి  రేషియోలో నలభై అయిదు కోట్లు ఆఫర్‌ ఇచ్చాడని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంత పెద్ద మొత్తం పెట్టడం మిగతా డిస్ట్రిబ్యూటర్స్ వల్ల అయ్యే పని కాదు. ఆ ధైర్యం చేయగలిగింది దిల్ రాజు ఒక్కడే. తనదైన స్ట్రాటజీలతో సినిమాని ప్రమోట్ చేసి నిలబెడతాడని అనేక సార్లు ప్రూవైన సత్యం. అయితే దిల్ రాజు బాగా ఎక్కువ రేటు పెట్టాడని అంటున్నారు.

ఆ రేటు పెట్టడానికి కారణం కేవలం ప్రభాస్ డేట్స్ కోసమే అంటున్నారు. ప్రభాస్ తన సినిమాలను తన సొంత బ్యానర్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దిల్ రాజు కు ప్రభాస్ తో మరో సారి చెయ్యాలని ఉంది. అందుకోసం ఇలా ఇంత రేటు పెట్టి మొదట రైట్స్ తీసుకుని ఆ తర్వాత మెల్లిగా డేట్స్ విషయం కదపొచ్చు అనే ఆలోచనతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. 

ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`. యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తామని నిర్మాత‌లు  ప్రకటించారు.