సాధారణంగా రిలీజ్ ముందు ఏ నిర్మాత  అయినా దర్శకుడు అయినా నా సినిమా అద్బుతం, కేక, తురుము అంటారు. అసలు రిజల్ట్ వాళ్లకు తెలిసినా కూడా తమ మాటల్లో చేతల్లో ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తూంటారు. అదే ఓపినింగ్స్ కు ఉపయోగపడతాయి. మార్నింగ్ షో పడ్డాక ఎలాగో విషయం బయిటకు వచ్చేస్తుంది. అప్పుడు చేసేదేమీ ఉండదు. ఆ విషయం దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతకు తెలియంది కాదు. కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్సో..మరేమో కానీ సెకండాఫ్ లేకుండా రేపు రిలీజ్ కాబోతున్న ఎఫ్ 2 షూటింగ్ వెళ్లిపోయాం అంటూ బాంబ్ పేల్చారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన ఇలా స్పందించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ”ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర ఓ మ్యాజిక్ ఉంది. సాధార‌ణంగా నేను స్క్రిప్టు లేకుండా సినిమాలు సెట్స్‌పైకి తీసుకెళ్ల‌ను. స్క్రిప్టు చేతిలో లేక‌పోతే ఓ సినిమా ఒప్పుకోను. కానీ అనిల్ మాత్రం సీన్లు చెప్పి ఒప్పిస్తాడు. సెకండాఫ్ లేకుండా షూటింగ్ కి ఎలా వెళ్లిపోయావ్ అని శిరీష్ ఆశ్చ‌ర్య‌పోయాడు. న‌న్ను అంత‌లా క‌న్విన్స్ చేస్తుంటాడు” అని ఆశ్చర్య పరిచారు దిల్‌రాజు.

విడుద‌ల‌కు స‌రిగ్గా రెండు రోజుల ముందు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం ఆశ్చర్యపరుస్తోంది.  రేపు సినిమా తేడా కొడితే ఇదే మాటను జనం అంటారనే ఆలోచన కూడా లేదా అని కొందరంటున్నారు. అదేమీ కాదు ఆయనకు సినిమా మీద నమ్మకం అలాంటిది అని ఇండస్ట్రీ అంటోంది. రేపు ఈ టైమ్ కు ఏది నిజం అనేది తెలిసిపోతుంది