Asianet News TeluguAsianet News Telugu

ముద్దు సన్నివేశాలపై దిల్ రాజు వ్యాఖ్యలు!

తన సినిమాల ద్వారా మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ప్రేక్షకులు మాత్రం చెడు సినిమాలనే చూడాలనుకుంటున్నారని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

dil raju speech at husharu movie audio release function
Author
Hyderabad, First Published Oct 1, 2018, 4:21 PM IST

తన సినిమాల ద్వారా మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటే ప్రేక్షకులు మాత్రం చెడు సినిమాలనే చూడాలనుకుంటున్నారని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తోన్న 'హుషారు' అనే సినిమా పాటల విడుదల కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దిల్ రాజు.. సినిమా పోస్టర్ పై ఉన్న చెడు వింటాను, చెడు మాట్లాడతాను, చెడు చూస్తాననే వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన సినిమాల ద్వారా మంచి విషయాలు చెప్పాలనుకుంటుంటే తను మాత్రం చెడు సినిమాల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తుందని.. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలు చూడడానికే ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు.

భవిష్యత్తులో తను కూడా అదే దారిలో  ప్రయాణించాల్సివస్తుందేమోనని కామెంట్లు చేశాడు. ఆడియన్స్ ముద్దు సన్నివేశాలు లేనిదే సినిమా చూడడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios