ఈ ఏడాది ఆరంభంలోనే 'ఎఫ్ 2' సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమాతో అతడికి కొట్లలో లాభాలు వచ్చాయి. ఆ ఆనందంలోనే తనతో ఈ సినిమా కోసం పని చేసిన కొందరు స్టాఫ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

విశాఖపట్టణం, హైదరాబాద్ లలో మొత్తం ఇరవై మంది స్టాఫ్ ని రేపు బ్యాంకాక్ ట్రిప్ కి పంపిస్తున్నాడు దిల్ రాజు. ఈ ఇరవై మదిని కూడా తన సొంత ఖర్చుతో నాలుగైదు రోజులు పాటు బ్యాంకాక్ ట్రిప్ కి పంపిస్తున్నారు. దీనంతటికీ పాతిక లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.

కానీ ఆ మొత్తాన్ని పెద్దగా లెక్క చేయడం లేదని దిల్ రాజు. తన స్తాఫ్ ఆనందం కోసం ఈ ట్రిప్ ని ఎరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. 'ఎఫ్ 2' సినిమా ఇచ్చిన సక్సెస్ అలాంటిది మరి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా అరవై కోట్ల వసూళ్లు, వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఈ సినిమా విడుదలైన తరువాత టాలీవుడ్ మరే హిట్ సినిమా రాలేదు. ఈ వారంలో కూడా సినిమాలు లేకపోవడంతో 'ఎఫ్ 2'కి కలిసొస్తోంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమా ఈ వారంతో కలిపి రూ.23 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.