తెలుగు పరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్‌ నిర్మాతల లిస్ట్‌లో దిల్‌ రాజు మొదటి వరుసలో ఉంటారు. ఈయనకు గోల్డెన్ రాజు అని కూడా పేరుంది. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా ఎదిగారు. అటు కమర్షియల్‌, ఇటు లోబడ్జెట్‌ చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు తన బ్యానర్‌లో దిల్‌ రాజు ఎంతోమంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. వారిలో కొంతమంది ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయన్ను చాలా మంది నిర్మాతలు అభినందిస్తారు. ఆయనలా ఎదగాలని చూస్తారు. అయితే ఇప్పుడు దిల్ రాజు తమను ఇండైరక్ట్ దెబ్బకొట్టాడని కొందరు చిన్న నిర్మాతలు గోలెత్తుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. వివరాల్లోకి వెళితే..

సినిమా బిజినెస్ ఊపులాంటిది. ఒక సినిమా హిట్టైతే అందరూ అలాంటి సినిమాలే ట్రై చేస్తూంటారు. ఒకటి తేడా కొడితే మిగతా వాళ్లంతా ఒక్కసారిగా జాగ్రత్తపడిపోతారు. ఇప్పుడీ ట్రెండ్ ఓటీటిల్లో కూడా మొదలైంది. ఈ మధ్యన దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి ఓటీటీలో రిలీజ్ చేసిన  వి సినిమా డిజాస్టర్ అవటం చాలా మంది నిర్మాతలకు పెద్ద దెబ్బ అయ్యిందని తెలుస్తోంది. కరోనా దెబ్బతో చాలా మంది ప్రొడ్యూసర్స్ ...లాభాల మాట దేవుడెరగు..పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు అన్నట్లు ఓటీటిల వైపు చూస్తున్నారు. అయితే ఓటీటిలు వి చిత్రం చాలా ఎక్కువ రేటుకు కొని నష్టపోవటంతో తమ దగ్గరకు వచ్చే ప్రతీ సినిమా వంకా అనుమానంగా చూస్తున్నారట. అసలు చాలా చిన్న నిర్మాతలను అయితే వాళ్లు పట్టించుకోవటం లేదట. ఈ క్రమంలో దాదాపు యాభై సినిమాలకు పైగా అమెజాన్ ప్రైమ్, జీ 5, నెట్ ప్లిక్స్ రిజెక్ట్ చేసారని తెలుస్తోంది. వీక్ కంటెంట్ ..లో క్వాలిటీ అనే కారణంతో వారు వద్దంటున్నారట. 

దాంతో దిల్ రాజు..బంగారు బాతుని ఒకేసారి కోసేసారు అని గోలెత్తిపోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి దిల్ రాజుకు సైతం ఇందులో ఏమీ అనటానికి లేదు. తన సినిమాని రిలీజ్ చేసారు. అలాగే ఆ సినిమాకు మంచి బిజినెస్ చేసుకున్నారు. అయితే సినిమా తేడా కొట్టడం జరిగింది. అది ఓటీటీలను ఎలర్టయ్యేలా చేసింది. ఓ  నిర్మాత అయితే ఆగిన సినిమాలను మళ్లీ 50 లక్షలు దాకా పెట్టుబడి పెట్టి ఫినిష్ చేసారు. వి రిలీజ్ కు ముందు మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన ఓటీటి వారు. ..ఇప్పుడు మొదట్లో వారు చెప్పిన రేటుని సగానికి సగం తగ్గించి చెప్తున్నారట.   ఈ క్రమంలో ఆ నిర్మాత గోలెత్తిపోతున్నారు.  ఈ పరిస్దితి కారణం  దిల్ రాజు అని ఆడిపోసుకుంటున్నారు. ఇలా ఓటీటి ద్వారా రిలీజ్ కు నోచుకోని వారంతా థియోటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వి కు వచ్చిన రిజల్టే  నిశ్సబ్దం కూడా వచ్చింది. అయితే ఓటీటిలో తమ సినిమా హిట్టందని నిశ్శబ్దం టీమ్ చెప్తోంది.