సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజు ఎంత పేరు సంపాదించాడో తెలిసిందే. సినిమాల జడ్జిమెంట్ విషయంలో ఆయనేం చెప్తే అది జరిగేది. కానీ రాను రాను అతడి జడ్జిమెంట్ లపై నమ్మకం తగ్గిపోతూ వస్తుంది. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు భావించాడు.

కానీ ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ చేసినప్పటికీ సరైన వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. 'శతమానంభవతి' చిత్రంతో దిల్ రాజు బ్యానర్ కి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగ్నేస 'శ్రీనివాస కళ్యాణం'తో ఫ్లాప్ అయ్యాడు.

అయినప్పటికీ దిల్ రాజు తనతో మరో సినిమా తీస్తానని బహిరంగంగా ప్రకటించాడు. 'థాంక్యూ' అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు దిల్ రాజుకి సతీష్ వేగ్నేసతో కలిసి పని చేయడం రిస్క్ అనిపించిందేమో ఆ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడు. ఆ కారణంగానే సతీష్ వేగ్నేస దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకి వచ్చి మరో నిర్మాతతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

నందమూరి కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి అంగీకారం కూడా పొందాడని చెబుతున్నారు. సాధారణంగా దిల్ రాజు తన బ్యానర్ లో పని చేసే దర్శకులను అంత ఈజీగా వదులుకోడు.  రిజల్ట్ తో పని లేకుండా వారికి అవకాశాలు ఇస్తుంటాడు. కానీ ఈసారి అతడికి ధైర్యం చాలలేదు. గతంలో హరీష్ శంకర్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయాలనుకొని అతను కాదనడంతో బయటకి వచ్చేశాడు.