వకీల్ సాబ్ వేణుశ్రీరామ్ కు చెక్, అనిల్ రావిపూడికు గుడ్ లక్

పవన్ తో ప్రాజెక్టుని తనకు ఇష్టమైన దర్శకుడు అనీల్ రావిపూడి కు అప్పచెప్పనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

Dil Raju reportedly is arranging a big movie for Anil jsp!

వకీల్ సాబ్ విజయం తర్వాత దిల్ రాజు దృష్టి  పవన్ తో మరో సినిమా చేయటంపై ఉంది. అలాగే పవన్ సైతం దిల్ రాజు బ్యానర్ లో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారని వినికిడి. ఈ క్రమంలో వకీల్ సాబ్ కాంబో రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ దిల్ రాజు ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. వకీల్ సాబ్ డైరక్టర్ వేణు శ్రీరామ్ గత 15 ఏళ్లుగా దిల్ రాజు క్యాంప్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు బయిటకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ తో ప్రాజెక్టుని తనకు ఇష్టమైన దర్శకుడు అనీల్ రావిపూడి కు అప్పచెప్పనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

మరో ప్రక్క పవన్ కల్యాణ్  వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనతో ఓకే అనిపించుకోవడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. అలాగే పవన్ తో దిల్ రాజు నిర్మించిన 'వకీల్ సాబ్' భారీ విజయాన్ని సాధించింది. మరో సినిమా చేయడానికి దిల్ రాజు ఆయనను అప్పుడే ఒప్పించాడు. తదుపరి సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కి ముట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి దిల్ రాజు సరైన కథ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. వేణు శ్రీరామ్ తో మొదట ఈ ప్రాజెక్టు అనుకున్నా విరమించుకున్నారు.

దాంతో తాజాగా ఆయన పవన్ కోసం ఒక మంచి కథను తయారు చేయమని అనిల్ రావిపూడికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి అటు పవన్ స్టైల్ .. ఇటు తన మార్కు కలిపి ఒక కథను తయారు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  'ఎఫ్ 3' తరువాత బాలకృష్ణతో అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత దిల్ రాజు - అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. గతంలో దిల్ రాజు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' .. 'ఎఫ్ 2' ఘన విజయాలను అందుకున్నాయి. హరీశ్ శంకర్ సినిమాను కూడా పూర్తిచేసిన తరువాత పవన్ ఈ  ప్రాజక్టుపైకి వస్తాడన్న మాట.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios