గడిచిన 2017లో నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ నుండి ఆరు సినిమాలను విడుదల చేశాడు. అందులే 'డీజే' తప్ప మిగిలిన అన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. డీజే సినిమాకు కూడా దిల్ రాజు నష్టపోయిందేమీ లేదు. 

ఆ విధంగా సంచనలం సృష్టించాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫీట్ సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలో ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే 'ఎఫ్ 2' చిత్రంతో సక్సెస్ అందుకున్న దిల్ రాజు.. మహేష్ బాబు 'మహర్షి'ని ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నాడు.

అలానే '96' రీమేక్ ని ఈ ఏడాదిలోనే విడుదల చేయబోతున్నాడు. శర్వానంద్, సమంతలను లీడ్ రోల్స్ లో ఎంపిక చేసుకున్నాడు. ఇవి కాకుండా.. దర్శకుడు వేణుశ్రీరామ్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ నాలుగు కాకుండా.. మరో రెండు సినిమాలు సిద్ధం చేయాలని చూస్తున్నాడు.

ఓ పాపులర్ డైరెక్టర్ ని తన దగ్గర ఉన్న కథని డైరెక్ట్ చేయమని అడుగుతున్నాడట దిల్ రాజు. ఆ విధంగా ఈ ఏడాదిలో మొత్తం ఆరు సినిమాలు విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి!