'పటాస్' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అనీల్ రావిపూడి అప్పటినుండి వరుస విజయాలు అందుకుంటూనే ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ పై అయన చేసిన మూడు సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి.

రీసెంట్ గా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ కి బాటలు వేసుకున్నాడు అనీల్. తన బ్యానర్ లో వరుసగా సినిమాలు తీసి సక్సెస్ లు ఇచ్చిన అనీల్ రావిపూడిని వదులుకోవడానికి దిల్ రాజు ఇష్టపడడం లేదు. తదుపరి సినిమా కూడా తన బ్యానర్ లోనే చేయాలని అడుగుతున్నారట. 

కానీ అనీల్ మాత్రం బయట నిర్మాతలతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాడట. వరుసగా అన్ని సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తే ఆ కాంపౌండ్ లోనే ఉండిపోతాడేమో అనే ఫీలింగ్ బయట నిర్మాతలకు కలుగుతుందని అనీల్ రావిపూడి భావిస్తున్నాడు. అందుకే బయట బ్యానర్ లతో సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

ఇప్పటికే చాలా మంది నిర్మాతలు అనీల్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో అనీల్ ని లాక్ చేయడానికి దిల్ రాజు ఈసారి స్టార్ హీరోని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు. స్టార్ హీరోని తీసుకొస్తే అతడికోసమైనా అనీల్ తన బ్యానర్ లో సినిమా చేస్తాడని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!