దిల్ రాజు కొత్త స్కెచ్!లైన్లో బోయపాటి
గత కొంతకాలంగా ఆయనకు స్టార్ హీరోల డేట్స్ దొరకటం లేదు. వంశీపైడిపల్లి, మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ప్రభాస్ తో సినిమా అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు. పోనీ రామ్ చరణ్, బన్ని డేట్స్ చూస్తే అవీ దొరకటం లేదు. దాంతో అందరూ బిజీగా ఉన్నారని తనతో అంటున్నా... హిట్ డైరక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నారు. ఈ విషయం గమనించిన దిల్ రాజు తన స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. పెద్ద డైరక్టర్స్ ని అడ్డం పెట్టి స్టార్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో పండిపోయారు. తన కెరీర్ లో ఎన్నో హిట్లు చూసారు. డిస్ట్ర్రిబ్యూటర్ గా, నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా ఆయనకు ఉన్న అనుభవం అపారం. ముఖ్యంగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేయటంలో ఆయనకు ఆయనే సాటి. అయినా సరే గత కొంతకాలంగా ఆయనకు స్టార్ హీరోల డేట్స్ దొరకటం లేదు. వంశీపైడిపల్లి, మహేష్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ప్రభాస్ తో సినిమా అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు. పోనీ రామ్ చరణ్, బన్ని డేట్స్ చూస్తే అవీ దొరకటం లేదు. దాంతో అందరూ బిజీగా ఉన్నారని తనతో అంటున్నా... హిట్ డైరక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నారు. ఈ విషయం గమనించిన దిల్ రాజు తన స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. పెద్ద డైరక్టర్స్ ని అడ్డం పెట్టి స్టార్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.
అలాగని కొరటాల వంటి స్టార్ డైరక్టర్స్ డేట్స్ కూడా అందుబాటులో లేవు. కాబట్టి కాస్త కాలుక్యులేటెడ్ గా వెళ్లి నెక్ట్స్ ఫామ్ లో ఉండే డైరక్టర్ ని లాక్ చేస్తే బెస్ట్ అనే నమ్మకానికి వచ్చారట. ఈ క్రమంలో ఆయన దృష్టిలో బోయపాటి పడ్డారు. బోయపాటి తొలి చిత్రం భద్ర సినిమా తనే నిర్మించారు. కాబట్టి బోయపాటిని సంప్రదించి నెక్ట్ సినిమాకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబో హిట్ అవుతుందనే నమ్మకంతో దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చారట. ఆ తర్వాత బోయపాటి తో ఏ స్టార్ హీరో డేట్స్ ఇస్తాడో చూసి అప్పుడు ముందుకు వెళ్తారట. అయితే ఇదంతా లాటరీ లాంటిదే. కాకపోతే ఈ ఫీల్డ్ ఈ గేమ్ లు తప్పవు. అడ్వాన్స్ లు ఇవ్వటం లాక్ చేయటం అనేది వెరీ కామన్.
దిల్ రాజు ప్రస్తుత చిత్రం విశేషాలకు వస్తే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఏంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా రిలీజ్ కాలేదు. ఇటీవల హైదారాబాద్ లో వకీల్ సాబ్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసారు. త్వరలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. 20 రోజులు షూటింగ్ చేయడంతో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవుతుంది.