Asianet News TeluguAsianet News Telugu

చెర్రీ సినిమాకు బడ్జెట్ క్లాజ్ తో శంకర్ అగ్రిమెంట్

 భారీదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రామ్‌చరణ్‌కు దక్కింది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. శంకర్‌ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు. చరణ్‌ - శంకర్‌ కలయిక, పాన్‌ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.  అయితే శంకర్ ప్రతీ సారీ తన ప్రొడక్షన్ కాస్ట్ ని పెంచుకుంటూ పోతున్నారు. నిర్మాతలకు భారమవుతున్నారు. హిట్ అయితే సమస్య లేదు. కాకపోతే మొత్తం ప్రొడక్షన్ హౌస్ లు దివాళా తీసే పరిస్దితి. 

Dil Raju made a written agreement with Shankar about the budget jsp
Author
Hyderabad, First Published Feb 18, 2021, 7:35 PM IST

 భారీదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రామ్‌చరణ్‌కు దక్కింది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. శంకర్‌ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు. చరణ్‌ - శంకర్‌ కలయిక, పాన్‌ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.  అయితే శంకర్ ప్రతీ సారీ తన ప్రొడక్షన్ కాస్ట్ ని పెంచుకుంటూ పోతున్నారు. నిర్మాతలకు భారమవుతున్నారు. హిట్ అయితే సమస్య లేదు. కాకపోతే మొత్తం ప్రొడక్షన్ హౌస్ లు దివాళా తీసే పరిస్దితి. 

శంకర్,రజనీకాంత్ ల కాంబోలో వచ్చిన ‘2.0’ పెద్ద హిట్టై ...భారీగా డబ్బు కలెక్ట్ చేసింది. అయినా ఫలితం లేదు. అదో కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా మిగిలిపోయింది. అంతేకాదు భారతీయుడు 2 చిత్రం ఫైనాన్సియల్ ట్రబుల్స్ తో ఇబ్బంది పడుతోంది. దాంతో శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడే పరిస్దితి ఏర్పడింది.

 ఈ నేపధ్యంలో దిల్ రాజు ఓ రిటెన్ ఎగ్రిమెంట్ శంకర్ తో చేసుకున్నారని సమాచారం. రామ్ చరణ్ తో మొదట ఎంతైతే బడ్జెట్ అనుకున్నామో అంతకు మించి పైసా ఎగస్ట్రా పెట్టనని, అందులోనే సినిమా పూర్తి చేసి ఫస్ట్ కాపీ ఇవ్వాలని ఆ ఎగ్రిమెంట్ లో రాయించుకున్నారట. గతంలో శంకర్ ఇలాంటి ఎగ్రిమెంట్స్ కు ఒప్పుకునేవాడు కాదు కానీ ఇప్పుడు ఆయన పరిస్దితి బాగోలేదు. సినిమా కావాలంటే తల ఒంచక తప్పని స్దితి. 
 
చిత్రం విశేషాలకు వస్తే...శంకర్‌ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్‌ నుంచి అభిమానులు కోరుకునే మాస్‌ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్‌ చేయని సరికొత్త పాత్రలో శంకర్‌ చెర్రీని చూపించనున్నారు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది. 
 
 ఈ సినిమా గురించి దిల్ రాజు ఇప్పటికే...‘‘ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ సినిమా షో మెన్‌ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’అని ప్రకటించి ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios