ఈ నెల 4వ తేదీన విడుదలైన 'లవ్ టుడే' సినిమా తమిళంలో భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకుడు .. హీరో కూడా.
తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన లవ్ టుడే సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం ఐదు కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు లవ్ టుడే కాన్సెప్ట్‌తో పాటు ప్రదీప్ యాక్టింగ్, కామెడీపై ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వారమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే వారానికి వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 25 నవంబర్ న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంటును నిర్వహించారు. వంశీ పైడిపల్లి - అనిల్ రావిపూడి గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ స్టేజ్ పై దిల్ రాజు మాట్లాడుతూ .. 'లవ్ టుడే' అంటే ప్రేమ అనేది ఈ రోజుల్లో ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఇప్పటికి తమిళనాడులో ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా అయిన 'కాంతార' గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అదే విధంగా 'లవ్ టుడే' గురించి కూడా మాట్లాడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
విడుదలకి ముందు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాను. కానీ రిలీజ్ తరువాత తెరపై హీరో చేసిన మేజిక్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో, డబ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాను. తెలుగులో 'ఎఫ్ 3' స్థాయిలో ఈ సినిమాను తమిళనాడులో ఆదరిస్తున్నారు. తెలుగునాట కూడా ఈ సినిమా థియేటర్లను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.
తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న విడుదల కాగా.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా 'ఇవాన' నటించింది. 2012లో మలయాళ సినిమాల ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్ తెరకి పరిచయమైంది. తమిళంలో ఇది ఆమెకి మూడో సినిమా. ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ జనంలోకి వెళ్లలేదు. హీరో - హీరోయిన్ ఇద్దరూ కూడా ఇక్కడి ప్రేక్షకులకు తెలియదు. కంటెంట్ ను కనెక్ట్ చేసే సమయం లేదు. అందువలన ఈ వారం ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనను దిల్ రాజు విరమించుకుని..ఓ వారం లేటుగా రిలీజ్ చేస్తున్నారు.
లవ్ టుడే చిత్రంలో ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
