తమిళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో నవంబర్‌ 4న విడుదల కాగా.. సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా 'ఇవాన' నటించింది.


ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’ .అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్ 15న లాంఛ్‌ కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో ఈవెంట్‌ను వాయిదా వేసింది దిల్ రాజు టీం. కాగా తాజాగా ట్రైలర్‌ ని విడుదల చేసింది దిల్ రాజు టీమ్. ట్రైలర్ విడుదల తోటే మంచి క్రేజ్ తెచ్చుకుంది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

YouTube video player

తమిళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో నవంబర్‌ 4న విడుదల కాగా.. సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా 'ఇవాన' నటించింది. 2012లో మలయాళ సినిమాల ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్ తెరకి పరిచయమైంది. తమిళంలో ఇది ఆమెకి మూడో సినిమా.

ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమా ట్రైలర్ జనంలోకి వెళ్లలేదు. హీరో - హీరోయిన్ ఇద్దరూ కూడా ఇక్కడి ప్రేక్షకులకు తెలియదు. కంటెంట్ ను కనెక్ట్ చేసే సమయం లేదు. అందువలన ఈ వారం ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనను దిల్ రాజు విరమించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 

లవ్‌ టుడే చిత్రంలో ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో సత్యరాజ్‌, రాధికా శరత్‌ కుమార్‌, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు.