సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. ప్రకటనతోనే శాకుంతలం అన్ని పరిశ్రమలను ఆకర్షించింది. ఇక చాలా కాలం నుండి శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో శాకుంతలం మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసిన నేపథ్యంలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దర్శకుడు గుణశేఖర్, సమంతలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ మీడియా సమావేశంలో పాల్గొనున్నారు. శాకుంతలం చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా శాకుంతలం మూవీ నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగస్వామి అయ్యారు. దీనితో మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. 


సమంత గతంలో ఎన్నడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక శాకుంతలం మూవీ మైథలాజికల్ మూవీ అని తెలుస్తుంది. శాకుంతలం జోడి అయిన దుష్యంతుడు పాత్ర కోసం మలయాళ యువ హీరోని తీసుకున్నారు. దేవ్ మోహన్ శాకుంతలం మూవీలో దుష్యంతుడిగా కనిపించనున్నాడు. మొత్తంగా టాలీవుడ్ నుండి శాకుంతలం రూపంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపొందుతుంది.