దిల్ రాజు మరో నెల యుఎస్ లోనే..కారణం ఇదే
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు అర్జంటుగా అమెరికాలో ల్యాండ్ అయిపోయారు. తన భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని ఆయన అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఆయన ఫస్ట్ వెడ్డింగ్ ఏనవర్శరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అందరూ ఆయన జూన్ 1 న ఇండియాకు వచ్చేస్తారనుకున్నారు.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో మే 4 అమెరికా ప్రభుత్వం తమ దేశానికి వచ్చేవారిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనికన్నా ఒకరోజు ముందే అంటే మే 3వ తారీఖునే ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు అర్జంటుగా అమెరికాలో ల్యాండ్ అయిపోయారు. తన భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని ఆయన అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఆయన ఫస్ట్ వెడ్డింగ్ ఏనవర్శరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అందరూ ఆయన జూన్ 1 న ఇండియాకు వచ్చేస్తారనుకున్నారు.
అయితే ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్లైట్స్ పై జూన్ 30 దాకా బ్యాన్ పెట్టడంతో అక్కడే ఈ నెలాఖరు దాకా ఉండిపోనున్నట్లు సమాచారం. దానికి తోడు ఇక్కడ సిని పరిశ్రమలో కూడా యాక్టివిటీ ఏమీ లేదు. షూటింగ్స్ అన్నిఆగిపోయాయి. ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో తెలియని పరిస్దితి. తెలంగాణా గవర్నమెంట్ జూన్ 10న లాక్ డౌన్ ఎత్తేసినా,వెంటనే షూటింగ్ లకు అయితే ఫర్మిషన్స్ వస్తాయనే నమ్మకం లేదు. కాబట్టి ఈ నెలాఖరు దాకా అక్కడ అమెరికాలో హ్యాపీగా ఉండిపోనున్నారు.
ఇదిలా వుంటే దిల్ రాజు.. వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల కామెడీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్3' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాగచైతన్య 'థాంక్యూ', సమంత 'శాకుంతలం', అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు', రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. 2021లో ఇప్పటికే ఈయన వకీల్ సాబ్, షాదీ ముబారక్ సినిమాలను విడుదల చేసారు.