Asianet News TeluguAsianet News Telugu

చేతులు మారిన #Dasara రైట్స్, మొదట ఎవరు? రీసేల్ లో దిల్ రాజు ఎంతకు కొన్నారు?

దసరా థీయాట్రికల్ రైట్స్ ని కూడా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్నారు.  మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Dil Raju has bet big on Dasara for Telugu states
Author
First Published Feb 1, 2023, 7:05 AM IST

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న దసరా సినిమా టీజర్ విడుజసై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  దసరా సినిమాలో నాని తన రెగ్యులర్ లుక్ కు పూర్తి విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు. మాసిన గడ్డం బొగ్గు గనుల్లో మసితో లుంగీ కట్టుకుని షర్ట్ సగం వేసుకుని మాస్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. టీజర్ లో నానిని చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. నాని లుక్ తో పాటు దర్శకుడు శ్రీకాంత్ యొక్క టేకింగ్ మరియు కంటెంట్ పై కూడా ట్రేడ్ లో  టీజర్ చూసిన తర్వాత నమ్మకం కలుగుతోంది. దాంతో  ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైపోయినట్లు సమాచారం. ఈ సినిమా దిల్ రాజు క్యాంప్ కు చేరిందని తెలుస్తోంది. 

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.  దసరా సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను హోల్ సేల్ గా అమ్మేసారు నిర్మాత సుధాకర్ చెరుకూరి.  ఆయన నుంచి 24 కోట్ల భారీ రేటుకే కొన్నారు చదలవాడ శ్రీనివాసరావు.  ఈ లోగా దసరా టీజర్ రిలీజై దుమ్ము రేపింది.  టీజర్ వచ్చిన వెంటనే దిల్ రాజు రంగంలోకి దూకారు. దాంతో వెంటనే ఊహించని ఆఫర్ ఇచ్చి చదలవాడ శ్రీనివాసరావు దగ్గర తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదలవాడ కొన్నదానికి దిల్ రాజుకు అమ్మిన దానికి మధ్య   నాలుగు కోట్ల తేడా వున్నట్లు సమాచారం. దాంతో సినిమా రిలీజ్ కు ముందే చదలవాడ ఫుల్ గా లాభపడ్డారు. ఇప్పుడు దిల్ రాజు తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చి మరింత లాభం పొందుతారు. ఒక్క టీజర్ తో ఈ సినిమా దశే మారిపోయింది.

ఇక ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకోవడానికి నిర్మాతలకు ₹28 కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తోంది.  దిల్ రాజు తెలుగు రాష్ట్రాలకు "దసరా" కోసం భారీగా బెట్ కాస్తున్నట్లే . నాని అంతకు ముందు చిత్రం అంటే సుందరానికి తొందరెక్కువ  ₹ 22 కోట్లకు అమ్ముడైంది, అయితే దాని భారీ కంటెంట్ తో  టాక్‌తో సంబంధం లేకుండా దసరా అద్భుతంగా ఓవర్‌ఫ్లో అవుతుందని దిల్ రాజు నమ్మి ఆ రేటు ఇచ్చి తీసుకున్నారు. ఇక ఈ సినిమా వెండితెరను కుదిపేస్తుందన్న నమ్మకంతో బాలీవుడ్‌లోని అనిల్ తడానీ వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని తీసుకొన్నారు. కర్ణాటక నుంచి KRG, కేరళ నుంచి E4E, ఓవర్ సీస్  Phars ఇలా ఎక్కడ చూసినా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి దూకారు.నాని ఈ దసరా సినిమా మీద చాలా హోప్ తో వున్నారు. తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందని, కమర్షియల్ గా కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమాను హిందీలో కూడా నేరుగా విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
కేవలం టీజర్‌తోనే సినిమా కప్‌కేక్‌లా అమ్ముడుపోవడంతో నానికి ఇది ఆనందం కలిగించే విషయమే. అయితే ఈ చిత్రం దాదాపు 60 కోట్ల వరకూ భారీ బడ్జెట్ .  అందులో చాలా భాగం  OTT స్ట్రీమింగ్ హక్కులు మరియు శాటిలైట్ హక్కులు నుంచి రాబోతోంది. నిర్మాత ఈ ఒక్క టీజర్ తో  పెట్టిన ప్రతి ఒక్క పైసాను వడ్డీతో సహా రికవరీ చేస్తారు. ఇప్పుడు దసరా సినిమా తో పాటు రిలీజ్ కానున్న మిగతా సినిమాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిల్ రాజు  సీన్ లోకి రావడంతో, ఇప్పుడు దసరా భారీగా ప్లాన్ చేస్తారు. ఆయన ఎంత దూకుడుగా ప్లాన్ చేస్తారో ట్రేడ్ లో  అందరికీ తెలుసు. 

Follow Us:
Download App:
  • android
  • ios