టాలీవుడ్ లో ఓ న్యూస్ విపరీతంగా షికారు చేస్తోంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. కూతురికి  పిల్లలతో  తాత అనిపించుకుంటున్న రాజు..మళ్ళీ తండ్రి కాబోతున్నాడంటూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. 

టాలీవుడ్ లో ఓ న్యూస్ విపరీతంగా షికారు చేస్తోంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. కూతురికి పిల్లలతో తాత అనిపించుకుంటున్న రాజు..మళ్ళీ తండ్రి కాబోతున్నాడంటూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారిన రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో మరణించారు. ఆతరువాత దాదాపు రెండేళ్లు ఒంటరిగానే ఉన్న రాజు భార్యను తలుచుకుని కుంగిపోయాడు. 

ఇక మొదటి భార్య శిరీషకు ఒక కూతురు ఉంది. ఆమె పెళ్ళి జరిగి పిల్లలు కూడా ఉన్నారు.ఇక భార్య మరణంతో కుంగిపోయిన తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు తానే దగ్గరుండి రెండో పెళ్లి జరిపించింది. కరోనా సమయంలోనే కొద్ది మంది బంధువుల సమక్షంలో దిల్ రాజు, వైఘా రెడ్డిపెళ్ళి ఘనంగా జరిగింది. 51 ఏళ్ల వయస్సులో రెండో పెళ్ళి చేసుకున్న దిల్ రాజు... తాజాగా తండ్రి కాబోతున్నాడట. ఇప్పటికే తన కూతురు పిల్లలతో తాతా అనిపించుకుంటన్న దిల్ రాజ్ ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నట్టు సమాచారం.

దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తపై దిల్ రాజు కాని ఆయన ఫ్యామిలీ కాని.. టీమ్ కానీ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేయనప్పటికీ..ఈ వార్త నిజమే అంటున్నాయొ ఇండస్ట్రీ వర్గాలు. ఇక హన్షిత రెడ్డి కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత అయ్యాకా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాతుండటంతో నెటిజన్లు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.