సినిమా అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయితే దర్శకుడికి చిత్ర నిర్మాత లేదంటే హీరోలు విలువైన బహుమతులు ఇస్తుంటారు. ప్రతీ ఇండస్ట్రీలో ఇలా గిఫ్ట్ లు ఇవ్వడం కామన్. గతంలో మహేష్ బాబు.. కొరటాల శివకి కారు బహుమతిగా ఇచ్చాడు.

అయితే ఇప్పుడు 'ఎఫ్ 2' చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడికి నిర్మాత దిల్ రాజు కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకి రాలేదు.

దీంతో అనీల్ రావిపూడి వద్ద ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులు ప్రస్తావించగా.. అందులో నిజం లేదని చెప్పినట్లు టాక్. దిల్ రాజు నుండి తనకు ఇప్పటివరకు ఎలాంటి గిఫ్ట్ అందలేదని అనీల్ అంటున్నాడట. ఇలాంటి వార్తలు పుట్టుకురావడంతో అనీల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆ వార్త నిజమైతే బాగుండని అనుకున్నాడట.

ఈ ఒక్క సినిమాతో దిల్ రాజుకి ముప్పై నుండి ముప్పై ఐదు కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో అనీల్ రావిపూడికి కారు గిఫ్ట్ గా ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదని అనుకున్నారు. కానీ అసలు అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.