దిల్ రాజు అతికి సెటైర్ల మీద సెటైర్లు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 3:05 PM IST
dil raju gets trolled on social media
Highlights

మా బ్యానర్ ది ఫిలిం అని ప్రకటించడం, నిన్న కొన్ని సినిమా థియేటర్ల వద్ద తోరణాలు, పందిళ్లు, మేళతాళాలు ఏర్పాటు చేశాడు. దీంతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. సినిమా చూసిన తరువాత కథలోని సినిమాకు ఇంత హడావుడి అవసరమా అంటూ జోక్స్ వేసుకుంటున్నారు.

సినిమా విడుదలై హిట్ అయిన తరువాత దాని గురించి ఎన్ని గొప్పలుపోయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా ఒక లిమిట్ వరకే లేదంటే సక్సెస్ తలెకెక్కిందనే కామెంట్స్ వినిపిస్తాయి. అయితే 'శ్రీనివాస కళ్యాణం' విడుదలకు ముందే ఇది సూపర్ హిట్ సినిమా, ఇది చూసిన తరువాత పెళ్లికాని వారు పెళ్లికి రెడీ అయిపోతారంటూ నానాహంగామా చేశాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. కొన్ని ఏరియాల్లో డిస్ట్రి బ్యూటర్లు డెబ్భై శాతం నష్టాలు ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

సినిమాను ముందే అమ్మేసుకున్నాడు కాబట్టి నిర్మాతగా దిల్ రాజుకి వచ్చిన నష్టం లేదు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని అత్యధిక రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు మాత్రం కనీసం వీకెండ్ లో అయినా.. టికెట్లు తెగుతాయేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో దిల్ రాజు చేసిన అతికి సెటైర్లు పడుతూనే ఉన్నాయి. మా బ్యానర్ ది ఫిలిం అని ప్రకటించడం, నిన్న కొన్ని సినిమా థియేటర్ల వద్ద తోరణాలు, పందిళ్లు, మేళతాళాలు ఏర్పాటు చేశాడు.

దీంతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. సినిమా చూసిన తరువాత కథలోని సినిమాకు ఇంత హడావుడి అవసరమా అంటూ జోక్స్ వేసుకుంటున్నారు. పెద్ద హిట్ అవుతుందన్న సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో దిల్ రాజు షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన జడ్జిమెంట్ పక్కా.. ఉంటుందని చెప్పుకొనే ఈ నిర్మాత ఇప్పుడు తనను తాను ఎలా సమర్ధించుకుంటాడో!  

loader