దిల్ రాజుకు రామ్ చరణ్ ఓదార్పు, ప్రకాష్ రాజ్ ని పట్టుకుని బోరున ఏడ్చిన నిర్మాత
తండ్రిని కోల్పోయి బాధలోఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఓదార్పు లభిస్తుంది. ప్రముఖులంతా దిల్ రాజుకు సపోర్ట్ గా నిలబడుతున్నారు.

తండ్రిని కోల్పోయి బాధలోఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఓదార్పు లభిస్తుంది. ప్రముఖులంతా దిల్ రాజుకు సపోర్ట్ గా నిలబడుతున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యాం సుందర్ రెడ్డి 86 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.ఈరోజు ఆయన అంత్యక్రియలను కూడా అయిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రిల్ రాజును ఓదార్చుతున్నారు. మరోవైపు దిల్ రాజు ఇంటికి వెళ్లిన చిరంజీవి... శ్యాం సుందర్ రెడ్డికి నివాళి అర్పించారు. శ్యాం సుందర్ రెడ్డి అంత్యక్రియలకు కూడా సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మరోవైపు దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో ప్రకాశ్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. దిల్ రాజుకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దుఖాన్ని ఆపుకోలేకపోయారు దిల్ రాజు.. నటుడు ప్రకాశ్ రాజ్ ను పట్టుకుని బోరున విలపించారు. రిల్ రాజును దగ్గరకు తీసుకునరి ప్రకాశ్ రాజ్ ఓదార్చారు. అంతే కాదు వరుసగా సినీ ప్రముఖుల రిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయన తండ్రి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు.
తాజాగా దిల్ రాజు ఇంటికి వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దిల్ రాజు తో మాట్లాడి ఆయన్ను ఓదార్చారు. చరణ్ దిల్ రాజుతో మాట్లాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తున్నారు.