కొన్ని సార్లు బిజినెస్ అంచనాలు తప్పుతాయి. అరెరే..మనం ఇంకొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని నాలుకు కరుచుకుంటారు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో మరీ ఎక్కువ ఇలాంటివి. హిట్ అవుతాయని ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్న క్రేజీ ప్రాజెక్ట్ చీదేయచ్చు. వర్కవుట్ కాదని లైట్ తీసుకున్న సినిమా కోట్లు రాబట్టచ్చు. ఎంతోకాలం నుంచీ సినిమా బిజినెస్ లో ఉన్న దిల్ రాజు లాంటివాళ్లు సైతం ఈ పరిస్దితికు అతీతలు కాదు. ఇదంతా ఎందుకూ అంటే..

టెంప‌ర్ త‌ర్వాత స‌రైన హిట్ కోసం చూస్తున్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఈ మ‌ధ్య‌ కాలంలో త‌న‌కు ఒక్క హిట్ కూడా రాలేద‌ని పూరీ ఈ స్దాయి హిట్ కొడతారని ఎవరూ ఊహించలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ కు ముందు ఆయన చెప్పిన రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ కొనటానికి పెద్దగా ఉత్సాహం చూపించలేదు.   ఈ చిత్ర క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో తానే నిర్మించి.. తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు పూరీ. ఛార్మితో క‌లిసి పూరీ క‌నెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు ఈయ‌న‌. అదే క్రమంలో బిజనెస్ కోసం రిలీజ్ కు ముందు దిల్ రాజు ని కలిసారట. 

అయితే  అంతకు ముందు మొహబాబా సినిమాతో డబ్బులు పోగొట్టుకున్న దిల్ రాజు...ఇస్మార్ట్ శంకర్ సినిమాని చాలా తక్కువ రేటుకు అడిగారట. అయితే ఛార్మి, పూరి ఇవ్వలేదట. దాంతో డిస్ట్రిబ్యూషన్ ని దిల్ రాజు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా సంచలనం సృష్టిస్టోంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమాకు తిరుగులేదనిపించుకుంటోంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అనుకున్న వాళ్లు సైతం ఈ హవా చూసి షాక్ అవుతున్నారు.