సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు.. మహేష్ తదుపరి సినిమాను కూడా నిర్మించాలని అనుకున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఓకే చేసుకున్నారు. ఈ సినిమాకి మరో నిర్మాతగా అనిల్ సుంకర యాడ్ అయ్యారు.

అలా భారీ బడ్జెట్ తో సినిమా చేయాలనుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికే తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ ఆఫార్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు డ్రాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ దిల్ రాజు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లిపోయారని అంటున్నారు.

అనిల్ సుంకర సోలోగా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని బయటకి రానివ్వనప్పటికీ జరిగింది మాత్రం ఇదేనని చెబుతున్నారు. అనిల్ రావిపూడిని తన బ్యానర్ నుండి బయటకి వెళ్లకుండా ఉండడానికి మహేష్ బాబుని తీసుకొచ్చిన దిల్ రాజు ఇప్పుడు సడెన్ గా ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లడమనే విషయం చాలా మందికి షాక్ ఇస్తోంది.

మరికొద్దిరోజుల్లో  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం గ్యాప్ తరువాత ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. నటుడు బండ్ల గణేష్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు.