డబుల్ హ్యాట్రిక్ దిల్ రాజును పొగడ్తలతో ముంచెెత్తిన బన్నీ,నాని

డబుల్ హ్యాట్రిక్ దిల్ రాజును పొగడ్తలతో ముంచెెత్తిన బన్నీ,నాని

డిస్ట్రిబ్యూటర్ గా సినీ ప్రస్థానం ప్రారంభించి.. తనదైన గ్రిప్ తో సినిమా రంగంలో నిర్మాతగా నిలదొక్కుకుని గల్లా ఎగరేసిన నిర్మాత దిల్ రాజు. ఈ ఏడాదు తన జీవితంలో మరవలేని దుఃఖం వెంటాడినా... ఆరు సినిమాలు తీసి వాటన్నింటినీ బ్లాక్ బస్టర్స్ గా తీర్చిదిద్దిన ఘనత దిల్ రాజు సొంతం. ఈ సందర్భంగా దిల్ రాజు నిర్వహించిన వేడుకల్లో ఆ సినిమాల దర్శకులు, నటీనటులు అంతా పాల్గొని దిల్ రాజును పొగడ్తలతో ముంచెత్తారు.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లలాడుతూ ఏడాదిలో ఆరు సినిమాలు తీసి.. ఆ ఆరూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలుగా నిలవడం ఏ నిర్మాతకైనా నిజంగా ప్రత్యేకమని అన్నారు. ఈ ఏడాది దిల్‌ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’, ‘నేను లోకల్‌’, ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎంసీఏ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘మోస్ట్‌ సక్సెఫుల్‌ ఇయర్‌ (2017)’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. దీనికి పలువురు నటులు, దర్శకులు హాజరై మాట్లాడారు.

 

‘ఇది చాలా ప్రత్యేకమైన వేడుక. ఇలాంటి ఈవెంట్‌ ఎప్పుడూ రాదు. వెంకటేశ్వర క్రియేషన్స్‌లో పనిచేయడం నిజంగా నా అదృష్టం. డీజే సక్సెస్‌ ఊరికే రాలేదు. డీజే షూటింగ్‌ సమయంలో ఆయన సతీమణి మరణించారు. దిల్‌ రాజు గారికి మంచి సక్సెస్‌ రావాలని గట్టిగా కోరుకున్నా. ఎంతో బాధతో కుంగిపోయిన ఆయనకు ఈ ఆరు విజయాలు మంచి ఉపశమనం ఇచ్చాయని అనుకుంటున్నా’ అని బన్నీ అన్నారు.
 

దర్శకుడు హరీష్ శంకర్‌ మాట్లాడుతూ.. ‘అప్పుడెప్పుడో యువరాజు ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. ఈ ఏడాది దిల్‌ రాజు ఆరు సినిమాలు హిట్‌ కొట్టారు. సినిమా విషయంలో వంద టెన్షన్లు పడతాం. వాటన్నింటినీ రాజు గారు తీసుకుంటారు. 24 గంటలూ దర్శకుడితో పాటు ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు సహకరిస్తుంటారు. రాజు గారు 48 గంటలు ఏకధాటిగా పనిచేయడం చూశా’ అన్నారు.
 

డబ్బు విషయంలో సొంత అన్నదమ్ములకే గొడవలు వస్తుంటాయని, కానీ.. రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమని హరీష్ శంకర్ కొనియాడారు. ‘ప్రపంచంలో డబ్బు మాత్రమే సంపాదించాలని ప్రయత్నిస్తే ఎవరూ సంపాదించలేరు. ప్యాషన్‌తో పనిచేస్తే డబ్బులు అవే వస్తాయి. ఈ ఏడాది ఆయన ప్యాషన్‌కు భగవంతుడు ఇచ్చిన వరం ఈ ఆరు విజయాలు’ అని ఆయన అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page