Asianet News TeluguAsianet News Telugu

‘యానిమల్‌’తెలుగు వెర్షన్.. వీకెండ్ అంత చేస్తుందా,ట్రేడ్ షాక్

దిల్ రాజు మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.15కోట్ల మేరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చాయని.. ఈ వీకెండ్ లోనే...

Dil Raju disclosed Animal is performing extraordinarily well in the Telugu states jsp
Author
First Published Dec 3, 2023, 1:26 PM IST


స్టార్ డైరక్టర్ సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal) కలెక్షన్స్ మామూలుగా లేవు. భారీ ఎక్సపెక్టేషన్స్  మధ్య విడుదలైన ఈచిత్రం అదిరిపోయే టాక్‌ను అందుకుని హై సక్సెస్ ని సొంతం చేసుకుంది. రణ్‌బీర్ (Ranbir Kapoor) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ తొలిరోజు ,రెండో రోజులు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.ఈ నేపధ్యంలో ఈ వీకెండ్ లో ఎంత కలెక్షన్స్ తెలుగు నుంచి వస్తాయనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై దిల్ రాజు మాట్లాడారు.‘యానిమల్‌’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. 

దిల్ రాజు మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.15కోట్ల మేరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చాయని.. ఈ వీకెండ్ లోనే రూ.35కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు గ్రాస్‌ మార్క్‌ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన.    ఆయన మాట్లాడుతూ.. సినిమా గ్లోబల్‌ అయ్యిందని చెప్పడానికి ఈ చిత్ర విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాల్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం అన్నారు.

ఇక అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే హవా చూపిన యానిమల్ చిత్రం మొదటి రోజు వందకోట్ల మార్క్‌ను రీచ్ అయ్యింది. ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా రూ.116కోట్లు వసూలు చేసినట్లు చిత్ర టీమ్ తెలిపింది. భారత్‌లో రూ.55 కోట్లు రాబట్టి ఈ ఏడాది విడుదలైన ‘జవాన్‌’, ‘పఠాన్‌’ల తర్వాత స్థానంలో నిలిచింది. అలాగే బాలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక ఈ వీకెండ్‌కు కలెక్షన్ల జోరు అదిరిపోతోంది. రూ.200కోట్లతో రూపొందిన ఈ మూవీ ఆ మార్క్‌ను సులువుగా అందుకుంటుందని సినీ ట్రేడ్ ఎనాలిసిస్ట్ ల అంచనా. సందీప్ వంగా గత సినిమా ‘కబీర్‌ సింగ్‌’ రికార్డులను బద్దలు కొడుతుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక దిల్‌రాజు ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో నాలుగు సినిమాలు, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మూడు చిత్రాలు చేస్తున్నట్లు చెప్పారు. రామ్‌చరణ్‌  శంకర్‌ల కలయికలో నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న మహేష్‌బాబు గుంటూరు కారం, వెంకటేష్‌ సైంధవ్‌ చిత్రాల్ని నైజాంలో తనే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్రాంతికి రావాల్సిన విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీస్టార్ సినిమాని మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios