టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్ రాజ్‌ కూతురు హన్షిత రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ రోజు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో చిన్ననాటి జ్ఞాపకాన్ని షేర్‌ చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు.  ఈ రోజు దిల్ రాజు మొదటి భార్య అనిత జయంతి. ఈ సందర్బంగా తాను చిన్నతనంలో తల్లితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్  చేసింది హన్షిత.

`పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నీ జ్ఞాప‌కాలు ఎల్ల‌ప్పుడూ నాతోనే ఉంటాయి.. వాటితోనే నేను జీవిస్తున్నా. కానీ కొన్ని రోజులు నేను నీతో ఉన్న‌ ఎన్నో జ్ఞ‌ప‌కాలు, నీతో కలిసి దిగిన ఫొటోలు దిగాను. నీ చిరున‌వ్వు చిత్రాలెన్నో` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. ఆ తరువాత చాలా కాలం ఒంటరిగానే ఉన్న దిల్‌ రాజు ఇటీవల కూతురి ఒత్తిడితో రెండో వివాహం చేసుకున్నారు. తేజస్వీని అనే అమ్మాయిని ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు.