Asianet News TeluguAsianet News Telugu

అది నీ బలుపు...అంటూ ‘మసూద’ ప్రొడ్యుసర్ పై దిల్ రాజు

నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేశావ్ చూడు.. అది నీ బలుపు.. గట్స్ అంటున్నా అంటూ దిల్ రాజు... ‘మసూద’ ప్రొడ్యుసర్ గురించి మాట్లాడారు.

Dil Raju congratulates the makers of  Masooda film
Author
First Published Nov 22, 2022, 7:38 AM IST


 మొదటి నుండి వైవిధ్యంగా అని అలా చేసుంటావు? కానీ నిర్మాత కోణంలో ఆలోచించాలి కదా. పెట్టిన డబ్బులు రావాలి. మళ్లీ సినిమా తీయాలి కదా? అందుకే ఫ్రైడే రోజు నాకు టెన్షన్ ఎక్కువైంది. నాకు భయం అనిపించింది. నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేశావ్ చూడు.. అది నీ బలుపు.. గట్స్ అంటున్నా అంటూ దిల్ రాజు... ‘మసూద’ ప్రొడ్యుసర్ ని అన్నారు.

మొన్న శుక్రవారం  నవంబర్ 18న  రిలీజైన ఈ హారర్ డ్రామా ‘మసూద’. మార్నింగ్ షో  నుండి పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. రివ్యూలు బాగా వచ్చాయి. అయితే అందుకు తగ్గ కలెక్షన్స్ అయితే నమోదు కావటం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఈ చిత్రాన్ని ఎస్‌విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్‌గా వ్యవహరించి.. సినిమాకు పనిచేసిన వారందరితో సినిమా విశేషాలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ ని కొన్ని ఇంట్రస్టింగ్ ప్రశ్నలు అడిగారు.
  
  50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా... నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. లెంగ్త్ తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? అని దిల్ రాజు అనడిగితే... మసూద నిర్మాత  రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..... సినిమా విషయంలో నిజాయితీగా ఉండాలని అనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. స్క్రిప్ట్ విన్నాక.. అందులో సోల్ పోకూడదని అనుకున్నాను. నేను ఈ స్క్రిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు.. ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదు అనే మెసేజ్ కూడా కారణం. అందుకే కమర్షియల్‌గా కాకుండా.. వైవిధ్యంగా ఉండాలని, నిజాయితీగా వెళ్లాను అన్నారు.

దానికి దిల్ రాజు మాట్లాడుతూ...మొదటి నుండి వైవిధ్యంగా అని అలా చేసుంటావు? కానీ నిర్మాత కోణంలో ఆలోచించాలి కదా. పెట్టిన డబ్బులు రావాలి. మళ్లీ సినిమా తీయాలి కదా? అందుకే ఫ్రైడే రోజు నాకు టెన్షన్ ఎక్కువైంది. నాకు భయం అనిపించింది. నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేశావ్ చూడు.. అది నీ బలుపు.. గట్స్ అంటున్నా అన్నారు దిల్ రాజు.

సంగీత (Sangeetha), తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన చిత్రం ‘మసూద’ (Masooda). ఈ సినిమాతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ హారర్ డ్రామా.. హిట్ టాక్ సంపాదించుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios