టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ఇతర ఇండస్ట్రీల వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. తమిళ్ లో శంకర్ తో ఇండియన్ 2 సీక్వెల్ కి ప్లాన్ చేసినప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ చేకోవద్దని తన సినిమాతోనే సిద్దమవుతున్నాడు. 

2014లో దిల్ రాజు నిర్మించిన ఎవడు సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ పాపులర్ డైరక్టర్ - ప్రొడ్యూసర్ నిఖిల్ అద్వానీతో నిర్మించేందుకు సిద్డమాయ్యారు. ఇక సినిమాలో కథానాయకులలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. రామ్ చరణ్ - అల్లు అర్జున్ మళ్ళీ ఒకే స్క్రీన్ లో కనిపించనున్నారు. 

ఇక తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమాకు హిందీలో మిలప్ జవేరి డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. హిందీ ఆడియెన్స్ కి నచ్చే విధంగా మేకింగ్ పరంగా దర్శకుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.