Asianet News TeluguAsianet News Telugu

చిరుతో దిల్ రాజు ప్రాజెక్టు కాన్సిల్ , ఇంట్రస్టింగ్ రీజన్ ?

చిరంజీవి సినిమా కోసం కథ రెడీ చేయించి తన దర్శకుడు అనీల్ రావిపూడితో  చెప్పించారట. అంతా సెట్ అయ్యిపోతుందనుకున్నారు. 

Dil Raju backs out of Chiranjeevi project due to remuneration issues? jsp
Author
First Published Dec 6, 2023, 11:35 AM IST


చిరంజీవితో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడుకూ,నిర్మాతకు ఉంటుంది. అయితే డేట్స్, కాలం అన్నీ కలిసి రావాలి. లేకపోతే ఏదో కారణంతో ప్రాజెక్టు పెండింగ్ లో పడిపోతుంది. దిల్ రాజు..ఈ మధ్యన చిరుతో సినిమా చేయాలనుకున్నారట. అందుకోసం కథ రెడీ చేయించి తన దర్శకుడు అనీల్ రావిపూడితో  చెప్పించారట. అంతా సెట్ అయ్యిపోతుందనుకున్నారు. భగవంత్ కేసరితో ఫామ్ లో ఉన్న అనీల్ రావిపూడి అంటే చిరంజీవి కూడా ఉత్సాహం చూపించారట.అయితే దిల్ రాజు దగ్గరే ప్రాజెక్టు ఆగిందంటున్నారు.

అంతా ఓకే అనుకున్నాక ప్రాజెక్టు పట్టాలు ఎక్కకపోవటానికి కారణం కేవలం చిరంజీవి కోట్ చేసిన రెమ్యునరేషన్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చిరంజీవి 70 కోట్లు రెమ్యునరేషన్ అడిగారని, మరో 70 అయినా అన్నీ కలిపి పెట్టాల్సి ఉంటుందని, పబ్లిసిటీతో కలిసి అది 150 కోట్లు దాకా చేరితే బిజినెస్ ఆ స్దాయిలో చేయటం కష్టమని దిల్ రాజు లెక్కలు వేసుకుని ఆగారని చెప్పుకుంటున్నారు.  అందుకే ఆ ప్రాజెక్టుని అదే అనీల్ రావిపూడితో రవితేజ హీరోగా ముందుకు వెళ్లమని చెప్పారని చెప్తున్నారు. 

ఇక ఇప్పటికి రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో బడ్జెట్ ఇష్యూలు దిల్ రాజు ఎదుర్కొంటున్నారట. అయితే అది ప్యాన్ ఇండియా భారీ ప్రాజెక్టు కాబట్టి భయపడక్కర్లేదనే ధైర్యంతో ఉన్నారట. రీసెంట్ గా  తమ బ్యానర్లో రూపొందుతున్న కొత్త సినిమాల గురించి కూడా దిల్ రాజు స్పందించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నాలుగు సినిమాలు,  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. శంకర్ - రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. 

అంతేకాకుండా సంక్రాంతి బరిలో పోటీపడుతున్న మహేష్ బాబు 'గుంటూరు కారం'వెంకటేష్ 'సైంధవ్'చిత్రాన్ని నైజంలో తానే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్రాంతికి రావలసిన విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాని మార్చ్ లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే సినిమా గ్లోబల్ అయిందని చెప్పడానికి ఈ సినిమా విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాన్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం" అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios