దిల్ రాజు తమ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్  తీసుకుంటే బాగుండును అని చాలా మంది ఎదురుచూస్తూంటారు.అందుకు కారణం రిలీజ్ విషయంలో ఆయన అనుసరించే ఫెరఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన్ వ్యూహం మాత్రమే కాదు...సినిమాని అంచనా వేయగలిగే నైపుణ్యం. 

గత కొన్ని సంవత్సరాలుగా డిస్త్రిబ్యూటర్ గా, కాసులు కురిపించే కథలు డిసైడ్ చేయగల అనలిస్టుగా, హిట్ దర్శకుల్ని పరిశ్రమకు అందించిన నిర్మతగా దిల్ రాజుకి మంచి పేరుంది.   గతేడాది  ఫ్లాపులతో ఇబ్బంది పడ్డా ఎఫ్ 2తో మళ్ళీ ఫాంలోకి వచ్చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ధియేటర్ లు ఎక్కువ ఉన్న ముగ్గురు నిర్మాతల్లో ఆయన ఒకరు. అందుకే ఆయన ఒక సినిమా కొన్నారంటే అందరి కళ్లు ఆ సినిమా మీదకు తప్పక వెళతాయి.

ట్రేడ్ వర్గాల నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వం వహించిన 118 చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేశారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 118 ఆర్ఆర్ ప్రివ్యూ చూసి సినిమా తెగ నచ్చడంతో తెలుగు రాష్ట్రాల హక్కుల్ని ఆయనే కోనేసారనే వార్త స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రైలర్ రిలీజై ఇప్పటికే ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ కి చక్కని స్పందన వస్తోంది.  \