అల్లు అర్జున్ మౌనం వీడాలి
నేను, శ్రీరామ్ వేణు కలిసి తదుపరి చేయబోయేది ‘ఐకాన్’ చిత్రమే అన్నారు దిల్‌రాజు.
ఎప్పుడైతే ‘వకీల్‌సాబ్’ హిట్ టాక్ తెచ్చుకుందో అందరి దృష్ణీ వేణు శ్రీరామ్ నెక్ట్స్ సినిమా ఏమిటనే దానిపై పడింది. అందులోనూ ముఖ్యంగా అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమా చేస్తారా చేయరా అనేది మరీ డిస్కషన్ పాయింట్ అయ్యిపోయింది. వేణు శ్రీరామ్ దాని గురించి ఎక్కువగా మీడియా తో మాట్లాడలేదు. ఉందని ఖరారు చేసి చెప్పలేదు. సినిమా లేదు అని అనలేదు. దాంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అంటూ దిల్ రాజుని, వేణు శ్రీరామ్ ని మీడియా వారు, సినీ అభిమానులు అడుగూతూనే ఉన్నారు. అంతెందుకు నిన్న జరిగిన దిల్ రాజు ప్రెస్ మీట్ లో కూడా ఇదే టాపిక్ వచ్చింది. దిల్ రాజు ఈ సినిమా ఉంది అని చెప్పేసారు.
నేను, శ్రీరామ్ వేణు కలిసి తదుపరి చేయబోయేది ‘ఐకాన్’ చిత్రమే అన్నారు దిల్‌రాజు. ఈ సినిమా గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా మనసుకు బాగా నచ్చిన కథ అది. పూర్తిస్థాయి స్క్రిప్టు సిద్ధంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ కథ చెప్పినప్పట్నుంచి మేం దాంతో ప్రయాణం చేశాం. కథ మా దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి తప్పక మొదలు పెడతాం’’ అన్నారు. ఆ విధంగా డైరక్టర్, నిర్మాత సిద్దం అని క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘ఐకాన్’ మూవీని స్టార్ట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
కానీ అల్లు అర్జున్ నే ఈ ఐకాన్ విషయమై ఏమీ మాట్లాడలేదు.ఆ ప్రాజెక్టు ఆన్ లోనే ఉందా లేదా అన్నది ఖరారు చేయటం లేదు. దిల్ రాజు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మీద ఆయన రెస్పాండ్ అయితే బాగుండును అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్పటిదాకా ఈ సస్పెన్స్ తప్పదు. హఠాత్తుగా ఓ రోజు ‘ఐకాన్’ మొదలుకానుందనే వార్త వింటామేమో. చూడాలి ఏం జరగనుందో.