టాలీవుడ్ యాక్షన్ దర్శకుడు వివి.వినాయక్ డైరెక్షన్ పనులను పక్కనపెట్టేసి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా ఫిట్ నెస్ కోసం జిమ్ లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇటీవల హెయిర్ లుక్ లో కూడా చేంజెస్ వచ్చినట్లు  తెలుస్తోంది. మొత్తానికి కథానాయకుడిగా వినాయక్ ఒక కొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు టాక్. 

ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా లాంచ్ ఈవెంట్ కి డేట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న వినాయక్ బర్త్ డే సందర్భంగా లాంచ్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమా కథ 1980కాలంలో సాగే ఒక పిరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక కథకు తగ్గట్టుగా వినాయక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడట. 

ఆ లుక్ కోసమే వినాయక్ ఇన్నాళ్లు జిమ్ లో కష్టపడ్డాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను కొత్త దర్శకుడు నరసింహా రావ్ తెరకెక్కించనున్నాడు