అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య మరో అమ్మాయి రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందట. ఇదంతా నిజమేనండీ.. కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. అసలు విషయంలోకి వస్తే పెళ్లి తరువాత కూడా సమంతా సినిమాలు కంటిన్యూ చేస్తోంది.

ప్రస్తుతం 'యూటర్న్' సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత దర్శకుడు శివ నిర్వాణతో కలిసి పని చేయడానికి అంగీకరించింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలో చైతు, సమంతా జంటగా కనిపించబోతున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమా ఇదే. అయితే కథ ప్రకారం ఇద్దరు భార్యభర్తలైన చైతు-సమంతా మధ్యలోకి మరో అమ్మాయి రావడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుందట.

కానీ చివరికి తమ ప్రేమ కారణంగా ఈ జంట ఎలా కలిసుంటుందనేదే ఈ సినిమా కథ. భార్య, భర్తల ప్రేమ విలువ చెప్పే పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తన మొదటి సినిమా 'నిన్ను కోరి' చిత్రంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి!