కోలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్సియల్ నటిగా వనితా విజయ్ కుమార్ కి పేరుంది.  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ నటి మంజుల పెద్ద కుమార్తె అయిన వనిత అనేక వివాదాలను రగిల్చింది. చివరకు కన్న తండ్రితో కూడా వనితా విజయ్ కుమార్ గొడవలకు దిగింది. రెండో భర్త ఆనంద్ రాజన్ తన కూతురుని వనిత కిడ్నాప్ చేసిందంటూ కేసు పెట్టడం జరిగింది. దీనితో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న వనితను పోలీసులు అక్కడే విచారించారు.
 
కాగా వనితా ఈ ఏడాది ముచ్చటగా మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్మాత పీటర్ పాల్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే పీటర్ మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా రెండో వివాహం చేసుకున్నాడని కేసు పెట్టింది. ఆ సమస్యల నుండి బయటికి వచ్చి హ్యాపీ లైఫ్ గడుపుతున్న సమయంలో పీటర్ అనారోగ్యానికి గురయ్యాడు. 

తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతిగా తాగుతున్నాడనే కారణంగా వనితా భర్త పీటర్ ని ఇంటి నుండి బయటికి గెంటి వేసిందట. కొద్దిరోజుల క్రితం వనితా తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భర్త మరియు పిల్లలతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ జాలీగా గడిపిన ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. 

ఈ గోవా ట్రిప్ లో వనితా మరియు పీటర్ గొడవ పడ్డారని సమాచారం. అతిగా తాగిన పీటర్ వనితతో అసభ్యంగా ప్రవర్తించాడట. ట్రిప్ ముగించుకొని వచ్చిన తరువాత కూడా పీటర్ ఎక్కువగా తాగుతూ ఉండడంతో, విసిగిపోయిన వనిత అతన్ని తన ఇంటి నుండి బయటికి పంపి వేసిందని వినికిడి. ఈ నేపథ్యంలో వనిత మూడో భర్తకు కూడా గుడ్ బై చెబుతుందా అనే మాట వినిపిస్తుంది.