సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతారావు, బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొన్ లకు ఒకరితో ఒకరికి చుట్టరికం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపిక కజిన్ బ్రదర్, అమృతారావ్ కజిన్ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకి రావడంతో ఈ ఇద్దరు హీరోయిన్ల చుట్టరికం వెలుగు చూసింది. ఈ ఇద్దరు నటీమణులు తమ భర్తలతో కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదే ఫంక్షన్ లో రణవీర్.. దీపిక చెప్పులను తీసుకొని చేతిలో పట్టుకొని నడవం చూసిన అభిమానులు రణవీర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీపికకి మంచి భర్త దొరికాడంటూ  కామెంట్స్ పెడుతున్నారు.