ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ బ్యూటీ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ ఈ విషయంపై ఈ జంట ఎప్పుడూ నోరు విప్పలేదు. ఈ క్రమంలో నిర్మాత విక్రమ్ ఫడ్నిస్ సోషల్ మీడియాలో అథియా ఆటపట్టిస్తూ ఆమె ఎఫైర్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశాడు. ఆథియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 'ట్రస్ట్ ది టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్' అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ పోస్ట్‌పై విక్రమ్ కామెంట్ చేస్తూ.. 'అథియా.. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ దగ్గరకు వెళ్దామా. అదే.. కౌలాలంపూర్' అని పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్ చేశారు. ఇది చూసిన అథియా 'నిన్ను బ్లాక్ చేయాల్సిన టైం వచ్చింది' అని బదులిచ్చింది.

దీంతో విక్రమ్ 'నేను అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాను. నీ వికెట్ పడిపోయాక పెవిలియన్‌కు చేరుకోవాల్సిందే' అంటూ ఆటపట్టించాడు. ప్రస్తుతం వీరిమధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రాహుల్ ని తన ప్రేమ విషయంపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్ గానే ఉంచుకోవాలనుకుంటున్నా అంటూ బదులిచ్చాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

always, always ✨

A post shared by Athiya Shetty (@athiyashetty) on Aug 29, 2019 at 2:23am PDT