పూజాహెగ్డే గురించిన ఈ వార్త నిర్మాతలని భయపెడుతోంది

టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నటి పూజాహెగ్డే. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘ముగముది’తో నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత ఇటు తెలుగు.. అటు హిందీలో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌లో బిజీగా ఉన్నారు.  

Did Pooja Hegde hike her remuneration? jsp

తమిళంలో తెరకెక్కిన ‘ముగముది’తో నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన భామ పూజాహెగ్డే. 2012లో విడుదలైన ఈ సినిమా తర్వాత పూజా సౌత్ లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నప్పటికీ తమిళంలో మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. కాగా, ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ గత కొన్నిరోజులుగా నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. స్టార్‌ హీరో విజయ్‌ సరసన ఆమె నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అది ఖరారే అని తెలిసింది. 

రీసెంట్ గా  ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం పూజాకు ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషకం ఇస్తున్నారట నిర్మాతలు. ఈ విషయం విన్న తెలుగు  నిర్మాతలు గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయట.ఇలా రేటు పెంచేస్తే రేపు మేము కూడా ఇదే రేటు ఇవ్వాల్సి వస్తుందని కంగారుపడుతున్నారట. నిజానికి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమె రెమ్యూనరేషన్ కేవలం ఒకటైనా కోటి రూపాయిలని, కానీ అప్పుడు ఆమె రెండున్నర కోటి రూపాయలకు పెంచింది. కానీ ఆతర్వాత ఆరునెలలకు పూజా హెగ్డే ఏకంగా 50 లక్షల రూపాయిలు పెంచింది. నిజానికి కొలీవూడ్ లో ఆమె మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉండడంతో తమిళ్ డైరెక్టర్లు అంత ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘రాధేశ్యామ్‌’ సినిమాల్లో నటించింది. జూన్‌ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదల కానుండగా.. జులై 30న ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు రామ్‌చరణ్‌కు జోడీగా ‘ఆచార్య’ సినిమాలో పూజా ఓ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘సర్కస్‌’లో ఈమె హీరోయిన్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios