'అర్జున్ రెడ్డి'లో జాన్వీ నటించాల్సిందట!

Did Janhvi Kapoor drop out of Arjun Reddy remake
Highlights

టాలీవుడ్ లో ఘన విజయం సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే

టాలీవుడ్ లో ఘన విజయం సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. తార సుతారియ హీరోయిన్ గా కనిపించనుంది. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించినట్లు సమాచారం. ఈ ఆఫర్ తన వద్దకు వచ్చినప్పుడు జాన్వీ కపూర్ మెంటర్ కరణ్ జోహార్ వద్దని చెప్పాడట. కెరీర్ ఆరంభంలో బోల్డ్ సినిమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో జాన్వీ ఈ సినిమా ఆలోచనను పక్కన పెట్టేసింది. కరణ్ జోహార్ స్వయంగా తార సుతారియను రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జాన్వీ 'ధడక్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా తన డెబ్యూ సినిమా కావడంతో సినిమా రిలీజ్ పట్ల జాన్వీ ఒకింత టెన్షన్ ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

loader