బిగ్‌బాస్‌4 27వ రోజు ఆద్యంతం సందడిగా సాగింది. రసవత్తరంగా జరిగింది. దోషి టాస్క్ లో అవినాష్‌, అరియానాలను ఓ ఆట ఆడుకున్నాడు నాగార్జున. ఈ టాస్క్ లో భాగంగా అవినాష్‌ని పిలిచాడు నాగ్‌. దివి దోషిగా, అవినాష్‌ స్టేషన్‌ మాస్టర్‌గా ఈ ఎపిసోడ్‌ సాగింది. దివిపై పలు ఆరోపణలు చేశాడు. ఇందులో దివి బాగా ఆడలేదనే తీర్పుని పొందింది. 

ఇది పూర్తి కాగానే ఈ మధ్య ఏదో సైన్‌ లాంగ్వేజ్‌ రాస్తున్నావట అని అవినాష్‌ని ఉద్దేశించి నాగ్‌ అన్నారు. సోఫాపై అరియానాకి ఏదో రాశావని ఆటపట్టించాడు. సీసీ కెమెరాలు నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ తెలిసిపోతుందన్నారు. అయితే సోఫాపై ఏం రాశావో చెప్పమని పట్టుబట్టాడు నాగ్‌. అయ్యో ఏం లేదంటూ బుకాయించాడు. ఇంతలో నాగ్‌ `ఐ లవ్యూ` అని రాశావని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్‌ తిన్నారు. అరియానా, అవినాష్‌ లబోదిబో మన్నారు. లేదు జోక్‌ చేశానని, `కూల్‌` అని రాసినట్టు నాగ్‌ చెప్పి అందరిని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 

ఇంతలో లాస్య హౌజ్‌లో మాకు తెలియకుండా ఏదో జరుగుతుందని కామెంట్‌ చేయడం ఫన్సీగా అనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అవినాష్‌ హైలైట్‌ అయి నవ్వులు పూయించాడని చెప్పొచ్చు.