తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోతున్నట్లు తెలిపింది. అయితే దీనికి కారణంగా రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్యా కనికా థిల్లాన్ అంటూ కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి.

దియా మీర్జా భర్త సాహిల్, కనికా కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారని.. ఆమె కారణంగానే సాహిల్-దియాలు విడిపోతున్నారని ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ స్పందించింది దియామీర్జా. సాహిల్ తో తను విడిపోవడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని.. తమ విడాకుల వ్యవహారంలో తమ సన్నిహితుల పేర్లు బయటకి తీసుకొచ్చి వాళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని.. ఓ మహిళగా మరో మహిళ ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తోన్న అబద్ధాలను ఖండిస్తున్నట్లు చెప్పింది.

సాహిల్ తో తన విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం కాదని స్పష్టం చేసింది. ఇకనైనా పుకార్లు ఆపాలని, తమ వ్యక్తిగతానికి మీడియా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. తమ విడాకుల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.

మీడియా కాస్త సంయమనం పాటించి.. తన అభిప్రాయాలను గౌరవిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. దియా ఇంత ఓపెన్ గా చెబుతున్నా.. బాలీవుడ్ లో మాత్రం పుకార్లు ఆగడం లేదు.