ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ దిల్ రాజు సెట్టయ్యాడు. 2017 లో వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ తో మంచి ఊపుమీదున్న దిల్ రాజుకి కి 2018 పెద్దగా కలిసి రాలేదు. డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని సినిమాలపై ఎంతో నమ్మకంగా పెట్టిన పెట్టుబడి వెనక్కి రాలేదు. అలాగే నిర్మాతగా కూడా ఆయన పెద్దగా లాభాలను అందుకోలేదు. 

లవర్ - శ్రీనివాస కళ్యాణం నష్టాలతో కొంచెం  గట్టిదెబ్బే కొట్టగా హిట్టవుతుంది అనుకున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాపెద్దగా లాభాలను అందించలేకపోయింది. ఇక ఏడాది శని మొత్తం ఒక్క F2 సినిమాతో తీసేసుకున్నాడు ఈ సీనియర్ నిర్మాత. వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ కామెడీ మల్టీస్టారర్ 70 కోట్లకు పైగా షేర్స్ అందించిన సంగతి తెలిసిందే. 

రీసెంట్ గా 50రోజుల వేడుకను కూడా జరిపారు. ఇక సినిమా కోసం కష్టపడిన అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి దిల్ రాజు లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో మహేసిహ్ కూడా భరత్ అనే నేను సినిమాకు వర్క్ చేసిన సహాయ దర్శకులకు ఇదే విధంగా మంచి గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దిల్ రాజు కూడా అదే తరహాలో గిఫ్ట్ ఇచ్చి చిత్ర యూనిట్ కి మంచి కిక్ ఇచ్చారు.