‘ధృవ ’ తొలి రోజు తెలుగురాష్ట్రాల వసూళ్లు  రామ్ చరణ్ గత చిత్రం బ్రూస్లీని  తాకలేకపోవడం నిరాశే.

అనుమానింనట్లే ‘ధృవ’ అదర గొట్టింది, టాక్ లో

రామ్ చరణ్ మెగా మూవీ ‘ధృవ’ ఇంట తెలుగురాష్ట్రాల్లో, బయట అమెరికాలో వేలం వెర్రి సృష్టించింది.

చిత్రమేమంటే, టాక్ విషయంలో మూవీ అభిమానులను ఏమాత్రం నిరాశపర్చలేదు. రెస్సాన్స్ ఇలా ఉంటుందనే చిత్ర నిర్మాణం జరగుతున్నపుడే అర్థమయింది. అదే ఉత్కంఠతో డిసెంబర్ 9 తేదీ కోసం ప్రేక్షక ప్రపంచం ఎదురుచూసింది. 

శుక్రవారం మొదటి రోజుల రెస్పాన్స్ చూశాక అంతా ‘ రామ్ చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినెషన్ ’ నిజంగానే ఇరగదీసిందని మొదటిషో అయినప్పటినుంచి వినపడుతూ ఉంది.

‘థని వొరవన్’ తమిళ్ కు తెలుగు వర్షన్ గా వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐపిఎస్ ఆఫీసర్ గా అభిమానుల అంచనాను మించి రాణించారనినేది యుఎస్ సర్వత్రా వినిపించిన మాట. ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ మా లాగే రియాక్టయ్యారు.

అయన రియాక్షన్ కొంతమందిని ఇబ్బందికి గురి చేసినా నిజం నిజమే.అమెరికాలో 143 చోట్ల నుంచి శుక్రవారం నాటికి ధృవ వసూళ్లు 196 వేల డాలర్లు చేరుకున్నాయి. ఇక్కడే అంచనాలు తారుమారయ్యాయి. గురువారం నాటి ప్రివ్యూ వసూళ్లు 223,224 డాలర్లు. అంటే రు 1.51 కోట్లు. ఈ వరవడి కొనసాగుతుందనే అనుకుంటున్నారు. టాక్ భిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపాయి.వసూళ్లు అలాగే కొనసాగుతాయని ఆశిద్దాం.

తెలుగురాష్ట్రాలలో కూడా ధృవ టాక్ విపరీతంగా వుంది. అయితే, కలెక్షన్లు మాత్రం దీనికి తగ్గట్టుగా లేకపోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల వారీగా ధృవ వసూళ్లు ఇలా ఉన్నాయి. ఎపి మొత్తం 10.55 కోట్లు. నైజాం రు. 3.26 కోట్లు. సీడెడ్ రు. 2.07 కోట్లు. వైజాగ్ రు. 1.32, తూ.గో 0.85 కోట్లు, ప.గో 0.89, క్రిష్ణా రు.0.67, గుంటూరు రు.1.08, నెల్లూరు రు. .041 కోట్లు.

రామ్ చరణ్ గత మూవీ బ్రూస్లీ తో పోలిస్తే ఇది తక్కువే. బ్రూస్టీ ది ఫైటర్ తొలిరోజు వసూళ్లు రు.16.55 కోట్లు. టాక్ విషయంలో బ్రూస్లీ కి ఏమాత్రం ధృవ తీసిపోదు. అయితే కలెక్షన్ లో మాత్రం బాగా వెనకబడింది.

More