తమిళ 'అర్జున్ రెడ్డి' షూటింగ్ పూర్తి!

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, May 2019, 5:00 PM IST
Dhruv Vikram's Adithya Varma shoot wrapped
Highlights

టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటిస్తోన్న ఈ రీమేక్ కి 'కబీర్ సింగ్' అనే టైటిల్ పెట్టారు. తాజాగా సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

హిందీ వెర్షన్ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో తమిళంలో కూడా ఈ రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ తనయుడు దధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బాల రూపొందించారు.

అయితే సినిమా అవుట్ పుట్ నిర్మాతలకు నచ్చకపోవడంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. యాభై రోజుల పాటు నిర్విరామంగా  షూటింగ్ నిర్వహించి ఫైనల్ గా పూర్తి చేసేశారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. 

loader