టెన్షన్ లో అనుష్క.. సంతోషంతో ధోనీ వైఫ్ వైరల్ వీడియో

Dhoni Wife Shouting for one more six video going viral
Highlights

టెన్షన్ లో అనుష్క.. సంతోషంతో ధోనీ వైఫ్ వైరల్ వీడియో

బెంగళూరు, చెన్నై మ్యాచ్‌ ముగుస్తుందనగా విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మ, ధోని భార్య సాక్షి ధోనిల హావభావాలపై ప్రేక్షకుల దృష్టి సారించారు. కోహ్లి టీమ్ ఓడుతుందని అనుష్క టెన్షన్ పడుతుందగా, ధోని టీమ్ విజయానికి చేరువ అవుతుండటంతో సాక్షి ధోని ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ 5వ బంతిని లో ఫుస్‌టాస్‌గా సంధించగా.. తన అనుభవాన్ని ఉపయోగించి ధోని సిక్సర్‌గా మలిచాడు. పలుమార్లు లేచి చప్పట్లు కొడుతూ భర్త ధోనికి మద్దుతు తెలిపిన సాక్షి ధోని.. ఆ సిక్సర్‌ను ఆస్వాధిస్తూ 'వన్‌ మోర్ సిక్స్' అంటూ చిన్నస్వామి స్టేడియంలో సందడి చేశారు. చివరి ఓవర్లో నాలుగో బంతిని తనదైన స్టైల్‌లో ధోని సిక్సర్‌గా మలిచి చెన్నైకి విజయాన్ని అందించాడు.

loader